తెలంగాణ

telangana

ETV Bharat / city

Discount On Challan : వాహనదారులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​​ చలాన్లపై డిస్కౌంట్​..!

Discount On Challan : వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఊరట కల్పించనున్నారు. పెండింగ్ చలాన్ల విషయంలో రాయితీ ఇచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు దస్త్రాన్ని సిద్ధం చేశారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నిర్ధేశించిన రాయితీ ప్రకారం పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశం లభించనుంది.

traffic police wants to give discounts on pending challans
traffic police wants to give discounts on pending challans

By

Published : Feb 24, 2022, 4:51 AM IST

వాహనదారులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​​ చలాన్లపై డిస్కౌంట్​..

Discount On Challan : ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పలు మోటారు వాహన నిబంధనలను అమలు చేస్తున్నారు. శిరస్త్రాణం ధరించకపోతే, అతివేగం, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్‌, సీటు బెల్టు పెట్టుకోకపోయినా, ఇతర నిబంధనలు అతిక్రమిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని వాహనదారులపైనా జరిమానా విధిస్తున్నారు. కూడళ్లు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా ఈ-చలాన్లు విధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 870కోట్ల జరిమానా విధించారు. 2019లో ఈ మొత్తం 414కోట్లు, 2020లో 672 కోట్లుగా ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఈ విధంగా జరిమానాలు విధించి వాహనదారుల్లో మార్పు తీసుకురావాలని ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

రాయితీ ఇస్తే చెల్లిస్తారని..

ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాను వాహనదారులు ఆన్​లైన్​లో కానీ లేకపోతే నేరుగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో చెల్లించవచ్చు. కొవిడ్ ప్రబలినప్పటి నుంచి వాహనదారులు చెల్లించే జరిమానాల మొత్తం తగ్గుతూ వస్తోంది. గత రెండేళ్లలో ట్రాఫిక్ చలాన్ల బకాయి కొండలా పేరుకుపోయింది. రాయితీ ఇస్తే పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించే అవకాశం ఉందని అభిప్రాయాన్ని ట్రాఫిక్ అధికారులు వ్యక్తం చేశారు. దీంతో మూడు కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ ఉన్నతాధికారులతో చర్చింది దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ సూచించారు.

వచ్చే నెలలో తుది నిర్ణయం..

డీజీపీ మహేందర్ రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మహేందర్ రెడ్డి 2 వారాల సెలవుపై వెళ్లడంతో దస్త్రం పెండింగ్ లో ఉంది. వచ్చే నెల రెండో వారంలో చలాన్ల రాయితీ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం ట్రాఫిక్ పోలీసుల వెబ్​సైట్​లో సాఫ్ట్​వేర్​ను ఏర్పాటు చేస్తారు. నిర్దేశించిన రాయితీ ప్రకారం వాహనదారులు ఆన్​లైన్​లో డబ్బులు చెల్లించే సౌలభ్యం ఉంటుంది.

ఐదేళ్ల క్రితం రాయితీ..

ఐదేళ్ల క్రితం పోలీసులు 50శాతం రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి వాహనదారులు పలుసార్లు సామాజిక మాధ్యమాల ద్వారా రాయితీ విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకువస్తున్నారు. రాయితీ ఇస్తే మాత్రం పెండింగ్‌లో ఉన్న చలాన్లు వసూలయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details