రాజధానిలో 60 లక్షల వాహనాలు రోజూ రోడ్ల మీద తిరుగుతున్నాయన్నది పోలీసుల అంచనా. ఏటా నగర రోడ్లపై 1300 మందికి పైగా వ్యక్తులు చనిపోతుంటే వేలాది మంది గాయాలపాలవుతున్నారు. ఇందుకు వాహనదారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అధికంగా చనిపోతున్నట్లు గుర్తించారు. ఆతర్వాత బాలబాలికల డ్రైవింగ్‌వల్ల, శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల్లోనూ ఎక్కువ మంది దుర్మరణం చెందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మూడు కారణాలతోపాటు డ్రైవింగ్‌లో చరవాణిలో మాట్లాడడమూ ఇటీవల పెరిగిందని గుర్తించారు.
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా.. అయితే డేెంజరే! - traffic rules violation
వాహనదారులూ.. తస్మాత్ జాగ్రత్త! వాహనం నడుపుతూ చరవాణిలో మాట్లాడడం ఇకపై కుదరదు. కోర్టుమెట్లు ఎక్కాల్సిందేనని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నేరం రుజువైతే జరిమానాతో పాటు నెల నుంచి మూడు నెలల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చరవాణిలో మాట్లాడుతూ వాహనం నడిపే వారిపై కేసులు నమోదు చేసి ఛార్జిషీటును కోర్టుకు సమర్పించాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.
గత ఏడాది కాలంలో ఈ కారణంతోనూ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయని, గత ఆరేడు నెలల్లోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తో దాదాపు 20 మంది చనిపోవడానికి కారణమైనట్లు తేలింది. ఈ ఉల్లంఘనులను ప్రస్తుతం చలానాలు రాసి పంపిస్తున్నారు. రూ.వెయ్యి వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో గత ఏడాది కాలంగా సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించి వేలాది కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ఈ తరహా కేసులు అధికంగా ఉంటున్నాయి.
సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ కమిషనరేట్
చరవాణి నడుపుతూ డ్రైవింగ్ చేస్తుండడం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. రవాణా చట్టం ప్రకారం ఈ ఉల్లంఘనులపై ఇకపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇకపై కేవలం జరిమానాతో వదిలేయకుండా వారిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి ఛార్జిషీటును కోర్టుకు సమర్పించాలని పోలీసులకు సూచించారు.
- ఇదీ చదవండి :మైనర్లకు వాహనం ఇస్తే జైలు శిక్ష తప్పదు: సీపీ