Traffic Diversion: ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఈరోజు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇచ్చే ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీ రంగనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు, మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తొద్దనే ముందస్తు జాగ్రత్తతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించనున్నారు.
సీఎం ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడో చూసుకొని వెళ్లండి.. - ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Diversion: సీఎం కేసీఆర్ ఇచ్చే ఇఫ్తార్ విందు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సాయంత్రం ప్రారంభంకానున్న ఇఫ్తార్ విందు కారణంగా.. 5 గంటల నుంచి రాత్రి 9 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ఎల్బీ స్టేడియం మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాపెల్ రోడ్డు మీదుగా జగ్జీవన్ రామ్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను పోలీస్ కంట్రోల్ రూం మీదుగా దారి మళ్లించనున్నారు. గన్ ఫౌండ్రీలోని ఎస్బీఐ మీదుగా బషీర్‌బాగ్ పైవంతెన వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రవీంద్ర భారతి నుంచి జగ్జీవన్‌రామ్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను.. సుజాత ఉన్నత పాఠశాల, పతే మైదాన్ మీదుగా దారి మళ్లించనున్నారు. బషీర్‌బాగ్ పైవంతెన మీది నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు.. చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నారాయణగూడ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్ కూడలి నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కింగ్ కోఠి నుంచి బొగ్గులకుంట మీదుగా బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను... ఈడెన్ గార్డెన్ వైపు నుంచి వెళ్లేలా దారి మళ్లించనున్నారు.
ఇదీ చూడండి: