తెలంగాణ

telangana

ETV Bharat / city

HYD Traffic: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సన్నాహక కార్యక్రమం.. ట్రాఫిక్‌ ఆంక్షలు - Traffic Diversion in hyderabad

హైదరాబాద్​లోని తీగల వంతెన పరిసరాల్లో హైదరాబాద్​ మోటారు రేసింగ్​ సంస్థ ఈరోజు రేసింగ్​లీగ్​ సన్నాహక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో.. పెద్ద ఎత్తున వాహనాలు రేసింగ్‌లో పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్​ను మళ్లించనున్నారు.

Traffic Diversion for Indian racing league preparation program
Traffic Diversion for Indian racing league preparation program

By

Published : Aug 22, 2021, 4:24 AM IST

హైదరాబాద్‌ మోటారు రేసింగ్‌ సంస్థ ఇవాళ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ కోసం సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి కేటీఆర్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. సన్నాహక కార్యక్రమంలో భాగంగా తీగల వంతెన పరిసర ప్రాంతాల్లో... పెద్ద ఎత్తున వాహనాల రేసింగ్‌ కొనసాగనుంది.

రేసింగ్ నేపథ్యంలో పోలీసులు పలు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రోడ్డు నెంబర్‌ 45 మీదుగా వచ్చే వాహనాలు మళ్లించడంతోపాటు... తీగల వంతెనను మూసివేయనున్నట్టు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఆర్ట్‌ గ్యాలరీ, మస్తాన్‌ గార్డెన్‌, ఇనార్బిట్‌ మాల్‌ మీదుగా వచ్చే వాహనాలను మళ్లించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details