వాహదారులు త్వరపడండి.. చలాన్లపై డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే..! Traffic Challans Discount: రాష్ట్రంలో వాహన చలానాల మొత్తం కొండలా పేరుకుపోయింది. ట్రాఫిక్ జరిమానాల మొత్తం 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాదాపు 90 శాతం మంది వాహనదారులకు జరిమానా భారంగా మారినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. కొండలా పేరుకు పోయిన వాహన చలానా మొత్తాన్ని రాబట్టేందుకు రాయితీ స్కీము తీసుకురావాలని భావించిన పోలీసు శాఖ.. మార్చి 1 నుంచి అమలు చేయనుంది.
వెబ్‌సైట్లలో లోక్‌అదాలత్ ఆప్షన్..
Discount on Traffic Challans : వాహనదారులు తమ చలానాలను ట్రాఫిక్ ఈ-చలానా వెబ్‌సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్ ద్వారా లేదా.. నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెల్లించవచ్చు. వాహనదారులు తమ పెండింగ్ చలానాలను చెల్లించేందుకు వీలుగా అధికారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. మార్చి 1 నుంచి వెబ్‌సైట్లలో లోక్‌అదాలత్ ఐచ్ఛికాంశం చేరనుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకోగానే.. రాయితీ పోనూ కట్టాల్సి సొమ్ము చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు.
సర్వర్ సమస్యలు రాకుండా..
Discount on Traffic Challans in Telangana : రాయితీ అమలు అయ్యే మార్చి 1 రోజు.. వాహనదారులు పెద్ద సంఖ్యలో వెబ్‌సైట్‌లకు వెళ్లే అవకాశాలుండటంతో.. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వర్ సమస్యలు రాకుండా సాఫ్ట్‌వేర్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. నెల రోజుల సమయం ఉంది కాబట్టి.. సమయానుకూలంగా జరిమానా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మార్చి 1 నుంచి రాయితీలు వర్తింపజేస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ చలానాలకు రాయితీ వర్తించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది. ట్రాఫిక్ చలానాలు రాయితీపై ట్రాఫిక్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ద్విచక్రవాహనాలకు, ఆటోలకు 75 శాతం మేర రాయితీ కల్పిస్తారు. అంటే 100 రూపాయలు చలానా మొత్తం ఉంటే.. అందులో 25 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. కార్లు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం రాయితీ చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మార్చి 1 నుంచి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉండనుంది.
ఇదీ చూడండి :చలాన్లు ఉన్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల గుడ్‌న్యూస్!