తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఒక్కొక్కటిగా సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు బస్ భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు తమ ఉద్యోగ విషయంలో అభద్రతా భావానికి లోనవుతున్నారని... వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈయూ నేతలు యాజమాన్యాన్ని కోరారు. 2017 వేతన సవరణ నేటి వరకు అమలు చేయడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
సమ్మె నోటీసులు ఇచ్చిన టీజేఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్...
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినపుడే కష్టాలు తీరుతాయని కార్మికులు భావిస్తున్నారు. అది నెరవేరే వరకూ పోరాడతామని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే టీజేఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. టీఎంయూ నాయకులు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.