టీఆర్‌ఏ రీసెర్స్ సంస్థ దేశంలోని 16 నగరాల్లో టీఆర్‌ఏ వైట్‌పేపర్ పేరిట సర్వే చేపట్టింది. మెంటల్ వెల్‌బీయింగ్ (ఎండబ్ల్యూబీఐ) పేరిట లాక్‌డౌన్ సమయంలో జనం మానసికంగా ఎలా ఉన్నారనేది గుర్తించే ప్రయత్నం చేసింది.
భాగ్యనగర వాసులు.. బహు ధైర్యవంతులు - tra research says that Hyderabad residents are courageous
ఏదైనా కష్టం పలకరించినప్పుడే మనోధైర్యం బయటపడుతుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న సమయంలోనూ హైదరాబాద్ ప్రజలు మనోనిబ్బరం కోల్పోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ జనం లాక్‌డౌన్ ఆంక్షలను నిలదొక్కుకుని గట్టిగానే నిలబడ్డారని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో గుర్తించారు.
![భాగ్యనగర వాసులు.. బహు ధైర్యవంతులు tra research organisation says that Hyderabad residents are courageous](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7402854-212-7402854-1590811969805.jpg)
చంఢీగఢ్, దిల్లీ, జైపూర్, లక్నో, గౌహతి, కోల్‌కతా, అహ్మదాబాద్, ఇండోర్, ముంబయి, నాగపూర్, పుణె, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కోయంబత్తూరు, హైదరాబాద్ నగరాల్లో 902 మందిపై ఈ సర్వే నిర్వహించారు. లాక్‌డౌన్ మొదటి దశ.. మూడో దశలో వారి మానసిక పరిస్థితులను అంచనా వేసింది.
హైదరాబాద్ ప్రజలు లాక్‌డౌన్ 1.0లో 64శాతం, లాక్‌డౌన్ 3.0 వేళ 82శాతం మానసిక నిబ్బరం ప్రదర్శించారు. మొదటి దశలో దిల్లీ, చెన్నై, చంఢీగఢ్, అహ్మదాబాద్, ముంబయి ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. మూడో దశ నాటికి అహ్మదాబాద్, కోల్‌కతా, నాగపూర్, చెన్నై, కోయంబత్తూరు, జైపూర్ కొచ్చి నగరాల్లో జనాలు భయానికి మరింత దగ్గరయ్యారు.
- ఇదీ చూడండి...జూన్ 15 వరకు లాక్‌డౌన్.. కొత్త నిబంధనలు ఇవే!