దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. భాజపాయేతర పార్టీల నేతలు హైదరాబాద్ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లో రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను నిలిపివేశారు. భారత్ బంద్‌లో భాగంగా మెట్రో రైళ్లు నిలిపివేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్టేషన్‌కు వచ్చి తెరాస నేతలను అక్కణ్నుంచి పంపించారు.
మెట్రో రైలు పట్టాలపై కూర్చొని తెరాస నాయకుల నిరసన - trs support to farmers protest
దిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్లో రైలు పట్టాలపై కూర్చొని తెరాస నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
మెట్రో రైలు పట్టాలపై కూర్చొని తెరాస నాయకుల నిరసన
రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు ఈ పోరాటం ఆగదని, రైతులకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని తెరాస నాయకులు స్పష్టం చేశారు.