కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌తో పాటు తనపై వీహెచ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పానని.. ఇందులో చెంచాగిరి ఏముందని ప్రశ్నించారు. ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంఛార్జీపై ఆరోపణలు చేస్తే అది అధిష్టానం మీద చేసినట్లేనని స్పష్టం చేశారు.
పార్టీ బాగుపడాలి.. తిరిగి అధికారంలోకి రావాలి: మల్లు రవి - మల్లు రవి తాజా వార్తలు
తనపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి ఖండించారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వాలని బహిరంగంగానే చెప్పానని అందులో చెంచాగిరి చేయడానికి ఏముందని ప్రశ్నించారు.

పార్టీ బాగుపడాలి.. తిరిగి అధికారంలోకి రావాలి: మల్లు రవి
పార్టీ బాగుపడాలి.. తిరిగి అధికారంలోకి రావాలి: మల్లు రవి
క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలన్నారు. తాను పార్టీ బాగుపడాలని తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఆశయ సాధన లక్ష్యం నెరవేరాలని కోరుకునే వాడినని వివరించారు.
ఇవీ చూడండి:రేవంత్‌ను వ్యతిరేకిస్తే అంతు చూస్తామంటున్నారు:వీహెచ్
Last Updated : Dec 26, 2020, 4:58 PM IST