ఏఐసీసీ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా "కిసాన్ అధికార్ దివాస్'' కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 31న కేంద్ర మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ కిసాన్ అధికార్ దివాస్ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.
కిసాన్ అధికార్ దివాస్‌ను విజయవంతం చేయండి: ఉత్తమ్‌కుమార్ - కిసాన్ అధికార్ దివాస్‌పై ఉత్తమ్‌కుమార్ పిలువు
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కిసాన్ అధికార్ దివాస్‌ను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, కేంద్రంలో పధాని నరేంద్ర మోదీ చేపట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నాయకులు ప్రసంగించాలని పేర్కొన్నారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సత్యాగ్రహ దీక్షలు చేయాలని ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు సూచించారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన రైతు ఉద్యమాలను, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన హరిత విప్లవం, దేశంలో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి తదితర అంశాలను ప్రస్తావిస్తూ నాయకులు ప్రసంగాలు చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
పంటలకు కనీస మద్దతు ధర లభించకపోవడం, కేంద్రంలో పధాని నరేంద్ర మోదీ చేపట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నాయకులు ప్రసంగించాలని పేర్కొన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో చేపడుతున్న కిసాన్ అధికార్ దివస్ కార్యక్రమాన్ని జిల్లాల స్థాయిలో డీసీసీ అధ్యక్షులు విజయవంతం చేయాలని సూచించారు.