ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహారిస్తున్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి విమర్శించారు. ప్రతి పౌరుడికి రాపిడ్ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ప్రైవేటు డయాగ్నిస్టిక్ సెంటర్లలో కరోనా పరీక్షలకు అనుమతివ్వాలన్నారు.
రాష్ట్రంలో అందరికీ రాపిడ్ టెస్టులు చేయాలి: టీపీసీసీ - రాపిడ్టెస్టులు చేయాలని టీపీసీసీ డిమాండ్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రాపిడ్ టెస్టులు నిర్వహించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతివ్వాలని కోరారు.
రాష్ట్రంలో అందరికీ రాపిడ్ టెస్టులు చేయాలి: టీపీసీసీ
రాష్ట్రంలో పది రోజులకే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నదని ఎద్దేవా చేశారు. కంటైన్‌మెంట్ జోన్లలో రాపిడ్ టెస్టులు నిర్వహించి రోజువారిగా బులిటెన్ విడుదల చేయాలని కోరారు. టెస్టుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని సూచించారు. అనుమానం ఉన్నవారు ప్రైవేట్ టెస్టులు చేయించుకోకుండా ఆపడం ప్రజల హక్కులను కాలరాయడమేనన్నారు.