Revanthreddy Today Tweet: భాజపా, తెరాస పాలనపై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి ఇరు పార్టీలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. భాజపా, తెరాస రెండు పార్టీలు చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైపోయిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భాజపా మంత్రాలకు చింతకాయలు రాలవు.. తెరాస తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవంటూ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
'భాజపా మంత్రాలకు చింతకాయలు రాలవు.. తెరాస తంత్రాలతో ప్రజా సమస్యలు తీరవు' - భాజపా తెరాసలపై రేవంత్‌రెడ్డి ట్వీట్
Revanthreddy Today Tweet: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాజపా, తెరాస పాలనపై మరోమారు విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఇరు పార్టీలను ఉద్దేశిస్తూ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. 'భాజపా మంత్రాలకు చింతకాయలు రాలవు.. తెరాస తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవంటూ' వ్యంగ్యాస్తాలు సంధించారు.
!['భాజపా మంత్రాలకు చింతకాయలు రాలవు.. తెరాస తంత్రాలతో ప్రజా సమస్యలు తీరవు' Revanthreddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16605972-822-16605972-1665402983600.jpg)
Revanthreddy
సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల్ని భాజపా, తెరాస తప్పుదోవ పట్టిస్తున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ గజకర్ణ గోకర్ణ టక్కు టమార డ్రామాలు మాని.. పరిపాలన, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని రేవంత్ రెడ్డి ట్విటర్లో సూచించారు. రెండు పార్టీలను ఉద్దేశిస్తూ పరిపాలనపై పలు సూచనలు చేశారు.
ఇవీ చదవండి: