తెలంగాణ

telangana

ETV Bharat / city

పేద బిడ్డలు చదువుతుంటే ఓర్వలేవా కేసీఆర్?: రేవంత్​రెడ్డి - బాసర ఆర్జీయూకేటీ తాజా సమాచారం

Revanth Tweet Today: చదువుల తల్లి నీడలో పేదల బిడ్డలు ఆకలి కేకలు వేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. సరస్వతీ పుత్రులపై సీఎం కేసీఆర్ కక్షగట్టారన్న రేవంత్... పేద బిడ్డలు చదువుతుంటే ఓర్వలేవా కేసీఆర్ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియోని ట్విటర్​లో పోస్ట్ చేశారు.

revanthreddy
revanthreddy

By

Published : Sep 4, 2022, 3:11 PM IST

Revanth Tweet Today: బాసరలో పేదల బిడ్డల్ని ప్రభుత్వం గోస పెడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల తల్లి నీడలో పేదల బిడ్డలు ఆకలి కేకలు వేస్తున్నారన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియోని ట్విటర్​లో పోస్ట్ చేశారు. అన్నంలో పురుగులు... కిచెన్​లో స్నానాలు... అడుగడుగునా ఆంక్షలు.. సవాలక్ష సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. సరస్వతీ పుత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టారన్న రేవంత్ రెడ్డి... పేద బిడ్డలు చదువుతుంటే ఓర్వలేవా కేసీఆర్ అని ప్రశ్నించారు. చదువు చెప్పమని పంపితే.. సర్కార్​ చంపుతుందని ట్వీట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details