Revanth Tweet: 'కేసీఆర్కు పిల్లల ప్రాణాల విలువ తెలుసా..?' - కేసీఆర్పై మండిపడిన రేవంత్
Revanth Tweet: పురుగులన్నం పెట్టి.. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వాన్ని ఎలాంటి పదాలతో విమర్శించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్కు .. ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
![Revanth Tweet: 'కేసీఆర్కు పిల్లల ప్రాణాల విలువ తెలుసా..?' Revanth Tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15965980-869-15965980-1659164539203.jpg)
Revanth Tweet
Revanth Tweet: పేద బిడ్డలకు న్యాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పురుగులన్నం పెట్టి.. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వాన్ని ఎలాంటి పదాలతో విమర్శించాలని రేవంత్ ధ్వజమెత్తారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్కు.. ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కేసీఆర్ భోజనం చేసే ముందు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.