కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడటం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కయ్యారా అని కేసీఆర్ను ప్రశ్నించారు.
Revanth reddy : కృష్ణా జలాల తరలింపు... తెలంగాణ ప్రజలకు మరణశాసనమే.. - revanth reddy fires on cm kcr
కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) మండిపడ్డారు. నీటి వాటాలో తెలంగాణ హక్కు కోసం కేసీఆర్ కనీస పోరాటం కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్తో ఆయన కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కృష్ణా జలాల తరలింపు... నీటి కేటాయింపుల తీరు.. తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాయడమేనని తెలిపారు.
కృష్ణా జలాల పంపకం కోసం బోర్డులు ఏర్పాటయ్యాయన్న రేవంత్(Revanth reddy).. జల వివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారని తెలిపారు. కృష్ణా, గోదావరి నది యాజమాన్యాల బోర్డులకు చట్టబద్ధత కల్పించారని చెప్పారు.
2015లో ఏపీ-తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకంపై ఒప్పందం జరిగిందని రేవంత్(Revanth reddy) వెల్లడించారు. 2015 ఒప్పందం ఏడాది మేరకే అని స్పష్టంగా ఉన్నా... ఏటా పొడిగించుకుంటూ వెళ్లారని మండిపడ్డారు. ఇప్పుడు వివాదం ముదిరాక.. తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ కనీస పోరాటం కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.