మంత్రి మల్లారెడ్డిపై రేవంత్‌రెడ్డి చేసిన భూ ఆరోపణలు చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుమ రాజకీయం వేడెక్కుతోంది. నిన్నటి వరకు సవాళ్లకే పరిమితమైన ఆరోపణలు.. ఇవాళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరే వరకు వెళ్లింది.
REVANTH: 'కేసీఆర్ రాజీనామా చేస్తే గజ్వేల్‌లో పోటీకి నేను సిద్ధం' - రేవంత్‌రెడ్డి తాజా వార్తలు
17:09 August 27
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వం రద్దు చేసిన ముందస్తు ఎన్నికలకు వస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజీనామా చేస్తే గజ్వేల్‌లో పోటీకి తాను సిద్ధమని స్పష్టం చేశారు. సెమీఫైనల్స్‌లో మల్లారెడ్డి బంధువుపై మర్రి రాజశేఖర్‌రెడ్డిపైనే గెలిచానని ఇక మిగిలింది ఫైనల్స్‌లో కేసీఆర్‌ని ఢీకొట్టడమే అని అన్నారు.
నేను గెలిచిందే మల్లారెడ్డి పైన. ఓడిపోయిన వారు ఏం మాట్లాడతారు. నేను మొన్న 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిందే మల్లారెడ్డి అల్లుడి మీద కదా. సెమీఫైనల్స్ మల్లారెడ్డి మీద గెలిచినా.. ఫైనల్స్ ఇక మిగిలింది కేసీఆర్ తోనే. నేను కేసీఆర్‌కు సవాల్ విసురుతున్న.. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తవా? మేం సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా గజ్వేల్‌ను నువ్వు రాజీనామా చేయ్.. అక్కడ మనిద్దరం తేల్చుకుందాం.- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి:REVANTH REDDY: 'మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై ఆధారాలున్నాయి'