దుబ్బాక ఉపఎన్నిక కేవలం ఒక అభ్యర్థి ఎన్నిక మాత్రమే కాదని.. తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ కమర్షియల్ చేశారు: ఉత్తమ్ - tpcc chief uthamkumar reddy
తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలను తెరాస నేతలు డబ్బుల మయం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తే ఏ పోరాటానికైనా కాంగ్రెస్ సిద్ధమని ఆయన అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వందల కోట్ల రూపాయల అవినీతికి తెరాస సర్కారు పాల్పడిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ కమర్షియల్ చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలను డబ్బుల మయం చేశారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ ఏ పోరాటానికైనా సిద్దంగా ఉంటుందన్నారు. రేపటి నుంచి తాను దుబ్బాకలోనే ఉంటానని చెప్పారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అందుబాటులో ఉంటానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత పూర్తిగా జీవన్ రెడ్డికి అప్పగించినట్లు వెల్లడించారు. మొయినాబాద్‌లో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆయన ఆక్షేపించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్ దాహార్తికి శాశ్వత పరిష్కారం!