భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైదరాబాద్ నగరంపై పూర్తి అవగాహన లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో కార్పొరేటర్‌గా గెలిచిన ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా భాజపా తీసుకొస్తే.. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బండి సంజయ్‌కు నగరంపై పూర్తి అవగాహన లేదు: ఉత్తమ్
తెరాస, భాజపాలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. బండి సంజయ్‌కు నగరంపై పూర్తి అవగాహన లేదని ఆరోపించారు.
బండి సంజయ్‌కు నగరంపై పూర్తి అవగాహన లేదు: ఉత్తమ్
జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌లకు సీఎం కేసీఆర్ మద్దతు పలికారా.. లేదా.. అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస, భాజపా దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.
ఇవీ చూడండి:భాజపా, ఎంఐఎం రెండూ ఒక్కటే...: ఉత్తమ్