తెలంగాణ

telangana

ETV Bharat / city

'12 నెలల్లో అధికారంలోకి వస్తాం.. రెండు లక్షల ఉద్యోగాలిస్తాం' - తెలంగాణలో గవర్నమెంట్​ జాబ్ నోటిఫికేషన్​

Revanth Reddy On Job Notification: మరోసారి నిరుద్యోగులను అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ వంచించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నియామకపత్రాలు ఇచ్చినప్పుడే కేసీఆర్‌ హామీ నెరవేర్చినట్లు అవుతుందన్న రేవంత్‌.. కేసీఆర్‌ ఉద్యోగం ఊడితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎద్దేవా చేశారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Mar 9, 2022, 9:28 PM IST

Revanth Reddy On Job Notification: ఇవాళ కేసీఆర్ సభలో చేసింది కేవలం ప్రకటన మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చి, పరీక్షలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు. నియామకపత్రాలు ఇచ్చినప్పుడే కేసీఆర్‌ హామీ నెరవేర్చినట్లు అవుతుందని రేవంత్‌ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన బిస్వాల్​ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నట్లు చెప్పిందని రేవంత్​రెడ్డి అన్నారు. అందులో కేవలం 90 వేలకే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారన్నారు. మిగతా ఖాళీలను ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

ఎనిమిదేళ్లుగా ఇన్ని ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​..మరోసారి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఉద్యోగం ఊడితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని గతంలో అనేక సార్లు చెప్పానని రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ భయంతోనే కేసీఆర్‌ హడావిడిగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారన్న రేవంత్‌రెడ్డి.. కేసీఆర్​ను ఉద్యోగాలు అడగాల్సిన అవసరం లేదన్నారు. మరో 12 నెలల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. సుమారు రెండు లక్షల ఖాళీలతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్​ ఇస్తామని రేవంత్​ వెల్లడించారు.

"కాంగ్రెస్‌ భయంతోనే కేసీఆర్‌ హడావిడిగా ఉద్యోగ ప్రకటనలు, లక్ష 90 వేలు ఖాళీలుంటే 90 వేల పోస్టులే చూపారు. మిగతా ఖాళీలను ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదు. కేసీఆర్‌ మరోసారి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ సభలో చేసింది ప్రకటన మాత్రమే. నియామకపత్రాలు ఇచ్చినప్పుడే కేసీఆర్‌ హామీ నెరవేర్చినట్లు అవుతుంది."

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

'12 నెలల్లో అధికారంలోకి వస్తాం.. రెండు లక్షల ఉద్యోగాలిస్తాం'

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details