ధాన్యం సేకరణ(paddy procurement telangana)పై కేంద్రం, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(pcc chief revanth reddy) మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో చేపట్టిన కాంగ్రెస్ వరిదీక్ష(congress vari deeksha) ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం(revanth reddy comments on kcr) వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే వేల టన్నుల ధాన్యం నీటిపాలైందని ఆరోపించారు. పంట వచ్చి 45 రోజులైనా కొనుగోలు ఏర్పాట్లు చేయలేదన్నారు.
రేపు గవర్నర్‌ని కలుస్తాం..
వరి రైతులకు ఉరివేస్తా అన్న వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ అందలం ఎక్కించారని రేవంత్ విమర్శించారు. రైతులను శాశ్వతంగా అదాని, అంబానీలకు బానిసలుగా మార్చేకుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పండించిన పంటను కొనని ప్రభుత్వాన్ని బొందపెడతామని హెచ్చరించారు. దిల్లీకి వెళ్లి.. కనీసం ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ కూడా కోరకుండా విందులు చేసుకుని తిరిగి వచ్చారన్నారు. అటు భాజపా నేతలు కూడా.. దిల్లీ వెళ్లొచ్చి కొత్త రాగం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై రేపు గవర్నర్ తమిళిసైని కలవనున్నట్టు రేవంత్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో(parliament winter session 2021)నూ.. రైతుల సమస్యలపై గొంతెత్తుతామని పేర్కొన్నారు. డిసెంబర్ 9 నుంచి 13లోపు దిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతామని రేవంత్ ప్రకటించారు.