తెలంగాణ

telangana

ETV Bharat / city

Revanth Reddy : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​దే హవా' - వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​దే హవా

Revanth reddy comments: హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో డిజిటల్ మెంబర్‌షిప్‌ కోసం నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నేతలకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచించారు.

tpcc chief Revanth reddy comments on congress digital membership
tpcc chief Revanth reddy comments on congress digital membership

By

Published : Jan 19, 2022, 3:23 PM IST

Updated : Jan 19, 2022, 4:39 PM IST

Revanth reddy comments: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో డిజిటల్ మెంబర్‌షిప్‌ కోసం నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ పనితీరు, డిజిటల్ మెంబర్‌ షిప్‌ కో ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తప్పకుండా పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు. పెద్దఎత్తున సభ్యత్వం చేయించిన నాయకులకు పార్టీలో గుర్తింపు దక్కుతుందని అన్నారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వం క్రియాశీలకంగా తీసుకుని పనిచేయాలని నేతలకు రేవంత్​ సూచించారు. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి డిజిటల్‌ మెంబర్​షిప్​లో తెలంగాణ ఆదర్శంగా ఉండాలన్నారు. ఎవరెన్ని సభ్యత్వాలు చేయిస్తున్నారో ఏఐసీసీ అధినేతల వద్ద రోజువారి సమాచారం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు మండలాలను ప్రాతిపదికగా తీసుకుని పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఒక నియోజకవర్గంలో 5 మండలాలలో పార్టీ బలంగా ఉంటే ఆ అసెంబ్లీ గెలుస్తామని తెలిపారు.

35 మండలాలలో పార్టీ బలంగా ఉంటే ఎంపీ స్థానం... 600 మండలాలలో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని రేవంత్​ రెడ్డి వెల్లడించారు. మండలాల్లో అధ్యక్షులు సరిగా పనిచేయకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో 10వేలు, నియోజకవర్గంలో 50వేలు , పార్లమెంట్‌ నియోజకవర్గంలో 3.5లక్షల మందిని సభ్యత్వం చేయిస్తే రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు అసెంబ్లీ ఇంఛార్జీలు ఈ నెల 30న ప్రత్యేకంగా ఒక్కో పార్లమెంట్‌ వారిగా మెంబర్‌షీప్‌పై సమీక్ష చేస్తామని వివరించారు. ఆ లోపు నియోజకవర్గం, మండలాల వారిగా పార్లమెంట్‌ ఇంఛార్జీలు సమావేశం ఏర్పాటు చేసి ప్రగతి నివేదిక ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎమ్మెల్యే సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, దీపక్ జాన్, చిన్నారెడ్డి, నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, సోహైల్ తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 19, 2022, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details