రాహుల్ గాంధీ అత్యంత క్లిష్ట సమయంలో అధ్యక్షుడుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏ బిల్లుపై ఓటింగ్ జరగాలన్నా పార్లమెంట్ తలుపులు మూసే ఓటింగ్ చేపడతారని, దీన్ని తప్పుపడుతున్న భాజపా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు వేయాలని వేసిన ఓట్లు కావని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా ఎద్దేవా చేశారు. శాసనసభ ఎన్నికల్లో 5 స్థానాల నుంచి ఒక్క స్థానానికి ఎలా పడిపోయిందని ప్రశ్నించారు.
సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: ఉత్తమ్ - rahul
తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని స్వాగతిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. రాహుల్ గాంధీ అత్యంత క్లిష్ట సమయంలో అందించిన సేవలు పార్టీ బలోపేతానికి దోహదం చేశాయన్నారు.
సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నాం: ఉత్తమ్