ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయం ముందు టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు బైఠాయించారు. తమ వాహనాలకు ట్యాక్స్ మినహాయించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో నడవని వాహనాలకు ట్యాక్స్ ఎలా కట్టమంటారని ప్రశ్నించారు. వాహనాలు నడవకపోయినప్పటికీ... డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు ఇస్తున్నామని.. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్లు ఇళ్ల మీదికి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నేటితో రెండు క్వార్టర్ల ట్యాక్స్ గడువు ముగిసిపోయి... మూడో ట్యాక్స్ కూడా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి.. రెండు క్వార్టర్ల ట్యాక్స్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్‌కు చెందిన ఐదుగురు సభ్యులతో రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్‌ఎంరావు చర్చలు జరిపారు.