Ramoji Film City and IRCTC Agreement: రామోజీ ఫిల్మ్ సిటీ, ఐఆర్‌సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై రామోజీ ఫిల్మ్ సిటీ ఏండీ విజయేశ్వరి, ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య జోన్ జీఎం నరసింగరావు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చే పర్యాటకులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. దేశవ్యాప్తంగా పర్యాటక సంస్థలకు ఐఆర్‌సీటీసీ ద్వారా సమాచారం అందనుంది. ఆర్ఎఫ్సీ ప్యాకేజీలపై ఐఆర్‌సీటీసీ అవగాహన కల్పించనుంది. పర్యాటకులకు చేరువయ్యేందుకు ఈ ఒప్పందం ఎంతో సహకరిస్తుందని ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య జోన్ జీఎం నరసింగరావు ఆకాంక్షించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీ, ఐఆర్‌సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం - రామోజీ ఫిల్మ్‌సిటీ
Ramoji Film City and IRCTC Agreement రామోజీ ఫిల్మ్‌సిటీ, ఐఆర్‌సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం కుదిరింది. పర్యాటకులను ఆకర్షించేలా ఐఆర్‌సీటీసీతో ఒప్పందం జరిగింది. దేశవ్యాప్తంగా పర్యాటక సంస్థలకు ఐఆర్‌సీటీసీ ద్వారా సమాచారం అందనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీ ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించటమే కాకుండా.. ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం కుదిరింది.

Tourism Agreement between Ramoji Film City and IRCTC
"రామోజీ ఫిల్మ్ సిటీ, ఐఆర్‌సీటీసీ సమన్వయంతో పర్యాటక ఒప్పందంపై సంతకం చేశాం. ఆర్ఎఫ్సీ ప్యాకేజీలు, ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలను రెండు వెబ్సైట్ల నుంచి మార్కెటింగ్ చేస్తం. ఇది పర్యాటకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీతో భాగస్వామ్యం కావటం గౌరవంగా ఉంది." - నరసింగరావు, ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య జోన్ జీఎం
రామోజీ ఫిల్మ్‌సిటీ, ఐఆర్‌సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం
ఇవీ చూడండి: