డ్రాగన్ కుట్ర అదే..!
తూర్పు లద్దాక్ గల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14 సమీపంలో... చైనా బలగాలు మోహరించి ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) బీఎస్ జైస్వాల్ పేర్కొన్నారు. జూన్ 15న భారత దళాలపై జరిగిన దాడికి... ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నిజానికి ఏమి జరిగిందో భారత రక్షణ మంత్రిత్వశాఖకు తెలుసుని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు గురించి ఇప్పటికీ సరైన మ్యాప్ లేదని, అందువల్ల చైనా... అక్రమంగా భారత్‌కు చెందిన ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆయన ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారం రోజుల్లో...
కొవిడ్-19 చికిత్సకు సంబంధించి దేశంలోనే మొదటి జెనరిక్ ఔషధం రెమ్‌డెసివిర్ (కొవిఫోర్) తయారీకి తమ సంస్థకు ఆమోదం లభించినట్లు ప్రముఖ మందుల తయారీ సంస్థ హెటెరో ప్రకటించింది. మరో వారం రోజుల్లో డ్రగ్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ రోజు ఏం జరిగింది?
భారత భూభాగంలో శిబిరం ఏర్పాటు... 300-350 జవాన్ల మోహరింపు... భారత సైన్యంపై దాడికి పక్కా కుట్ర... రాళ్లు, ఇనుప కడ్డీలతో సిద్ధం... గల్వాన్ లోయలో జూన్ 15 జరిగిన హింసాత్మక ఘర్షణకు ముందు పొరుగు దేశం సంసిద్ధత ఇది. భారత్ కథ మాత్రం భిన్నం. మనవైపు ఉన్నది అంతా కలిపి 100 మందే. అయినా... కర్నల్ సంతోష్ బాబు బృందం ఏమాత్రం బెదరలేదు. శత్రు సైన్యంపై విరుచుకుపడి... భారత సైన్యం పంజా దెబ్బ రుచి చూపించింది. చైనా శిబిరాన్నితునాతునకలు చేసింది. ఆనాడు సంతోష్ బృందం వీరోచిత పోరాటం సాగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇక మీ ఇష్టం..
గల్వాన్ లోయ ఘటనతో వాస్తవాధీన రేఖ వెంబడి 'రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్'లో కీలక మార్పులు చేసింది భారత్. అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ముగ్గురు హతం
శ్రీనగర్ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా నగరంలో అంతర్జాల సేవలు నిలిపివేసిన అధికారులు.. ప్రజా రవాణాపై కూడా ఆంక్షలు విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.