1. ధన్యవాద సభ
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు... అప్పుడే అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ధన్యవాద సభ పేరిట అధికార తెరాస ఏకంగా... ముఖ్యమంత్రినే రప్పిస్తోంది. సాగర్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే రూ.3 వేల కోట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నికల ప్రకటనకు ముందే పనులు ప్రారంభించబోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెలంగాణలో కొత్తపార్టీ..
తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అన్నారు. విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన కోరిక అని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కాంగ్రెస్ అభ్యర్థులు
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ నుంచి రాములు నాయక్, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నుంచి చిన్నారెడ్డిని ఎంపిక చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. స్థానిక పోరు
తొలి విడత ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సాక్ష్యమిదే..
తాను శాంతినికేతన్‌లోని ఠాగూర్ కుర్చీలో కూర్చున్నారన్న కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి అమిత్ షా. పర్యటకుల కోసం కేటాయించిన విండో సీట్లో కూర్చున్నానని వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.