1. కుక్కల దాడిలో..
కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన... హైదరాబాద్‌లోని బహుదూర్‌పురా అసద్‌బాబా నగర్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పదోన్నతులు
ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. నెల రోజులుగా కసరత్తు చేసి... అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినట్టు డీపీహెచ్ కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రైతు భరోసా దీక్ష
పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ తలబెట్టిన 'రాజీవ్ రైతు భరోసా దీక్ష'కు అపూర్వ మద్దతు లభించింది. శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్ దీక్షలు కూర్చున్నారు. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆకస్మిక తనిఖీలు..
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని మాన్యవర్ బస్తీ దవఖానాను తనిఖీ చేసిన సీఎస్... రోగులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం సైతం ఆసుపత్రి తెరిచి మరో రోజు సెలవు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రేపు ఇంటికి చిన్నమ్మ..
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిపాలైన జయలలిత సన్నిహితురాలు శశికళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. నాలుగేళ్లపాటు జైలులో ఉన్న చిన్నమ్మ ఈ ఆదివారం ఇంటికి చేరుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.