1. వణుకు..
రాష్ట్రంలో రాబోయే రెండు, మూడు రోజులు శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాది, ఈశాన్య దిక్కుల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో చలిగాలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఫొటో పెట్టాల్సిందే..
కేంద్ర పథకాల్లో ప్రధాని ఫొటోను ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని ఫొటో పెట్టకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు.. ఫొటోలు పెట్టే అంశంలో అధికారుల పాత్ర ఏమిలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. జాగ్రత్తపడుతున్నాం..!
బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ వచ్చిన దృష్ట్యా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వారిపట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కొత్తరకం వైరస్‌పై కేంద్రం ఇప్పటికే సూచనలు చేసిందన్న ఆయన ఆ మేరకు అన్ని శాఖలను రాష్ట్రప్రభుత్వం అప్రమత్తం చేసిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కీలక భేటీ..
సాగు చట్టాలపై చర్చించేందుకు రావాలని కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాలు స్పందించాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు బుధవారం అన్ని రైతు సంఘాలు భేటీ కానున్నాయి. ఈ మేరకు రైతు సంఘం నాయకుడు కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొత్త యుగానికి నాంది..
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన సాగు చట్టాలు దేశ వ్యవసాయ రంగంలో కొత్త యుగానికి నాంది అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అవి రైతులకు లాభం చేసేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు దఫాలుగా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపామని.. మరో విడత చర్చల కోసం ఓ తేదీని ప్రకటించాలని కోరుతూ అన్నదాతలకు లేఖను రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.