1. వరాల జల్లు..
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పలు ఎత్తిపోతల పథకాలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. జమిలి ఎన్నికలు..!
జమిలి ఎన్నికలపై పురపాలక మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు అప్రమత్తమై సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మేమూ పాల్గొంటాం..
రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా భారత్ బంద్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు. అన్నదాతలకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలు తలపెట్టాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దిల్లీలో రాములమ్మ..
అంతా అనుకున్నట్లే... సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి... భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఆమె... దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమితిషాను కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అన్నదాతకు అండగా..
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 11వ రోజూ కొనసాగుతోంది. ఐదో దఫా చర్చలూ ఎలాంటి ఫలితం లేకుండానే ముగియడం వల్ల నిరసనలను ఉద్ధృతం చేశారు. దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో తమ పోరాటం కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 8న రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్‌కు విపక్షాలు సహా అన్ని రంగాల ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.