1. మన వైపే అని నిరూపించాలి..
రాష్ట్రంలోని ఆరు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పలువురు నేతలు సీఎంకు తెలిపారు. రెండు ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానాల్లోనూ తెరాసదే గెలుపు ఉంటుందని నేతలు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దుబ్బాక ఉప ఎన్నికకు రెడీ..
రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని పోటీకి దింపనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పోరాడతాం..
హాథ్రస్ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. బాధితురాలి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు దక్కలేదన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తన బాధ్యతలను అర్థంచేసుకోవాలని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అక్కడి ప్రజలకు వరం..
ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ సొరంగ మార్గం హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ ప్రజలకు వరప్రదాయినిగా నిలవనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దీని ద్వారా ప్రజలుకు మెరుగైన వైద్య, వ్యాపార సేవలు సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, హిమాచల్ ప్రదేశ్ ప్రజల మధ్య ప్రత్యేక బంధానికి 'అటల్ సొరంగ మార్గం' సాక్ష్యంగా నిలుస్తుందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. న్యాయం చేస్తాం..
యూపీ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారుల బృందం హాథ్రస్లో పర్యటించింది. బాధితురాలి కుటుంబం నుంచి వాంగ్మూలం తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతుందని తెలిపింది. దోషులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.