1. ఏం చేద్దాం..
ఎల్ఆర్ఎస్ లేని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార విషయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. ఈ విషయమై నాలుగు ఐచ్చికాలు ప్రభుత్వం ముందు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఖాతాల్లో రేపు సొమ్ము
రేపటి నుంచి అన్నదాతలకు రైతుబంధు సొమ్ము అందనుంది. ఇందుకు సంబంధించి అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. మొదట ఎకరాలోపు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసి... ఆ తర్వాత మిగతా వారికి సొమ్ము అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వావ్ ప్రహ్లద్..
చెరువుగట్టున, నదీతీరాన దొరికే నున్నటి గులకరాళ్లంటే ఎవరికిష్టముండదు. వివిధ పరిమాణాలు, రంగుల్లో ఉండే ఈ రాళ్లతో చిన్నతనంలో ఆడుకున్న జ్ఞాపకాలు అందరికీ ఉండే ఉంటాయి. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు కూడా అలా బాల్యంలో గులకరాళ్లతో ఆడుకున్న వాడే. కాకపోతే ఆ రాళ్లను కేవలం జ్ఞాపకంగా మిగుల్చుకోకుండా.. ఓ వ్యాపారంగా మలచుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కొత్త వైరస్‌పై సమీక్ష
కొత్తరకం కరోనా వైరస్ భయాల నేపథ్యంలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ కీలక సమావేశం నిర్వహించింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో.. కొత్త స్ట్రెయిన్ వివరాలు, వ్యాప్తిని అడ్డుకోవడం వంటి విషయాలపై చర్చించింది. మరోవైపు, బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన 50 మంది నమూనాలను పరీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చర్చలకు ఓకే.. కానీ
దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. కేంద్రంతో మరోసారి చర్చలకు సిద్ధమయ్యారు. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిన రైతు సంఘాలు.. ఈ నెల 29న చర్చలకు సిద్ధమని ప్రకటించాయి. అయితే.. చర్చల సందర్భంగా చట్టాల రద్దు గురించి మాట్లాడకుంటే డిసెంబర్ 30న ట్రాక్టర్ మార్చ్ చేపట్టాలని కర్షకులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.