తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9am
టాప్​టెన్ న్యూస్ @9AM

By

Published : Dec 14, 2020, 9:01 AM IST

1. తగ్గుతున్న కేసులు

రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,78,108 చేరింది. వైరస్​తో ఇప్పటి వరకు 1,496 మంది మృతి చెందారు. 24 గంటల్లో 631 మంది కోలుకోగా... 2,69,232 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఉద్యోగాల జాతర!

రాష్ట్రంలో కొలువుల జాతర మొదలుకానుంది. నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీపై ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్​... 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఖాళీల వివరాలతో జాబితాను తయారుచేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. నేడే ప్రారంభం..

సుదీర్ఘ విరామం అనంతరం వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతున్నాయి. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు మొదలవుతున్న నేపథ్యంలో... ఇప్పటికే చాలా మంది స్లాట్లు బుక్​ చేసుకున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్​ ప్రక్రియకు సంబంధించిన సౌకర్యాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. నిరాహార దీక్ష

సాగు చట్టాల రద్దు ఏకైక డిమాండ్​గా నేడు రైతు సంఘాలు నిరహార దీక్ష చేపట్టాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. దిల్లీలోని నిరసన ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తగ్గించండి..

కొవిడ్ నిర్ధరణ చేస్తున్న పరీక్షలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎక్కువగా యాంటీజెంట్ పరీక్షలు నిర్వహిస్తుండగా... వాటిని తగ్గించి, ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు పెంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్​ కార్యదర్శి బలరాం భార్గవ సంయుక్తంగా లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. త్వరలో ఆల్గే..

'ఆల్గే' అంటే ఒక శైవలం అని మాత్రమే తెలుసు. ఆల్గేను త్వరలో ఆహార పదార్థంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. శరీర వృద్ధికి తోడ్పడే ఈ మేలు రకం శైవలాన్ని.. విదేశీయులు విస్తృతంగా వాడుతున్నారు. అయితే.. ఈ ఆల్గే వల్ల ఉపయోగాలేంటి? దాని వల్ల శరీరానికి ప్రయోజనమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఎస్వాతీనీ ప్రధాని మృతి

ఆఫ్రికా దేశం ఎస్వాతీనీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో డ్లామిని(52) మరణించారు. నాలుగు వారాల క్రితం కరోనా బారినపడిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఎస్వాతీనీ ఉప ప్రధాని థెంబా మసుకు అధికారిక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సగటున 7 గంటలు..

లాక్​డౌన్​ తర్వాత స్మార్ట్​ఫోన్​లో గడిపే సమయం బాగా పెరిగింది. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కోసం చాలా మంది భారతీయులు.. ఎక్కువ సమయం స్మార్ట్​ ఫోన్లో వెచ్చిస్తున్నట్లు తేలింది. ఈ ఏడాదిలో సగటు స్మార్ట్​ఫోన్​ వినియోగం 25 శాతం పెరిగి, దాదాపు 7 గంటలకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అలా చేస్తే బలపడతాం..

ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్​లో మయాంక్​తో పాటు ఓపెనర్​గా కేఎల్​ రాహుల్​ను​ పంపించాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్​ ఆశిష్​ నెహ్రా. అతడికి అవకాశమివ్వడం వల్ల టీమ్​ఇండియా ఓపెనింగ్​ మరింత బలంగా తయారవుతుందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రానాతో నటించడం..

చిత్రసీమలో.. లింగ అసమానతల విషయంలో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయని చెప్పారు హీరోయిన్​ సాయిపల్లవి. హీరో రానా సమానత్వాన్ని విశ్వసించే వ్యక్తి అని కొనియాడారు. 'విరాఠపర్వం' సినిమాలో ఆయనతో కలిసి నటించడం గొప్ప అనుభవమని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details