1. హోరాహోరీ..
శతాబ్దంలో ఎరుగని విధంగా అమెరికాలో ఓటింగ్ శాతం నమోదయ్యేలా కనిపిస్తోంది. 67 శాతం మంది ఓటర్లు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగమైనట్లు అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పలు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అన్నదాతల ఆవేదన
అప్పటి దాకా ఉపాధి నిచ్చిన ఆటో లాక్‌డౌన్ దెబ్బకు ఆగిపోయింది.. పల్లెకొచ్చి వ్యవసాయం ప్రారంభించిన ఆ యువకుడికి వర్షాలు మిగిల్చిన నష్టం అక్షరాలా రూ.6 లక్షలకు పైనే..గత మార్చిలో వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోయి ఎన్నో ఆశలతో ప్రస్తుత వానాకాలంలో వరి సాగుచేసిన ఓ అన్నదాత చేనును చెరువు ముంచేసింది. ఇప్పటీకీ నీటిలోనే మునిగిఉన్న పైరుపై ఇక ఆశలు వదిలేసుకున్నారు..వీరిద్దరే కాదు.. రాష్ట్రంలో భారీ వర్షాలకు పూర్తిగా ‘మునిగిపోయిన’ బాధిత రైతులెందరో.. అతివృష్టి మిగిల్చిన అగాథంపై వారిని కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నష్టాలు వీడేనా..!
కరోనా దెబ్బకు కుదేలైన ఆర్టీసీ... గడిచిన 7 నెలల్లో రూ. 1,579 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. మే 19 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినప్పటికీ... ప్రజలు ప్రయాణించకపోవడం వల్ల నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మే నుంచి అక్టోబర్ వరకు క్రమంగా ఆదాయం పెరుగుతూ వస్తున్నా... సంస్థ ఇంకా నష్టాల్లోనే ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు ప్రారంభం కావడం... ఆదాయం మరింత పెరుగుతుందని సంస్థ యాజమాన్యం అశాభావం వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కనులవిందు
అద్భుత కళాఖండాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా కనీవినీ ఎరుగని రీతిలో నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ వీడియోను వైటీడీఏ అధికారులు విడుదల చేశారు. సప్తరాజ గోపురాలు, అష్టభుజి మండప ప్రాకారాలు, పూర్తిగా కృష్ణ శిలతో ఆలయ పునర్నిర్మాణం, వివిధ నారసింహ రూపాలు, దేవతా విగ్రహాలు, పద్మాలు, యాలీ పిల్లర్లతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఆలయ అందాలు, అద్భుత కళాఖండాలను చూపించే దృశ్యమాలిక భక్తులకు కనువిందు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'నేపాల్ ఆర్మీ జనరల్'గా నరవాణే!
సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు కీలక ద్వైపాక్షిక అంశాలు చర్చించటానికి భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం నరవాణే నేడు నేపాల్ చేరుకోనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.