1.నీటి భేటీ..!
నదీజలాల వివాదాలపై అత్యున్నత మండలి రెండో సమావేశం నేడు మధ్యాహ్నం జరగనుంది. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల నేపథ్యంలో జరుగుతున్న భేటీ ఆసక్తిరకంగా మారింది. రాష్ట్ర ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వాదనను తిప్పికొట్టడంతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాగా కేటాయింపులు చేయాలని, గోదావరి జలాల్లో అదనంగా నీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మళ్లీ బ్యాలెట్టే..
త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్ని బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు వద్దని మెజార్టీ రాజకీయ పార్టీలు తేల్చి చెప్పడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుని సోమవారం ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. చీరలు రెఢీ..
అక్టోబర్ 17 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా నిరుపేద మహిళలకు ఉచితంగా అందజేసే బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలకు చేరాయి. ఈ నెల 9 నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాలు, నగరాలు, పట్టణాలు, మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ జరగాలని కలెక్టర్లకు సర్కారు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నేడు స్పష్టత..?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మరణించిన రామలింగారెడ్డి భార్యకు తెరాస టికెట్ ఖరారు చేసింది. ఇప్పటికే ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు ప్రచారం జరిగగా.. ఈ విషయమై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. నేడే విడుదల
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 9న ప్రారంభం కానుంది. నవంబరు 5 వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూలు ఖరారు చేశారు. మిగిలిన సీట్లను కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం నవంబరు 4న మార్గదర్శకాలు ప్రకటించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.