1. సీఎంలతో పీఎం..
కరోనా విస్తృతి అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం భేటీ కానున్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరు, మహమ్మారిని అరికట్టడానికి చేపడుతున్న చర్యలు.. తదితర అంశాలపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సేవల కోసం మార్పు..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ముమ్మరమయ్యాయి. గడిచిన మూడేళ్ల వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం... కసరత్తు వేగవంతం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్లు, ఉద్యోగులతోపాటు డాక్యుమెంట్ రైటర్ల వివరాలు తెప్పించుకున్నందున... పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పోస్టల్ బ్యాలెట్..
గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై ఎన్నికల అథారిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ మంగళవారం ఆయన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కరోనా సోకిన వారికి, వృద్ధులకు, వికలాంగులకు తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మార్గదర్శకాలు..
డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ప్రైవేటీకరణకు చేపట్టాల్సిన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, నమూనా పత్రాల ముసాయిదాను సైతం విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనలు, సలహాలను తెలపాలని ప్రజలను కేంద్రం కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. వైద్యానికి చికిత్స
'అందరికీ ఆరోగ్యం' అనే హామీ ప్రకటనలకే పరిమితమవుతుందే తప్ప వాస్తవరూపం దాల్చడం లేదు. 70ఏళ్ల గణతంత్ర రాజ్యంలో ఇప్పటికీ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తూనే ఉంది. సరైన వైద్యవసతులు లేక ఏటా సుమారు 5కోట్ల మందివరకు పేదరికంలోకి వెళ్తున్నారు. కరోనా మహమ్మారితో ఈ మహా సంక్షోభం మరింత బట్టబయలైంది. తెలుగురాష్ట్రాల్లో బస్తీ దవాఖానాల ద్వారా విస్తృత సేవలపై ఆశలు రేపుతున్నా.. మౌలిక వసతులు కరవయ్యాయి. భావి ధన్వంతరుల సృష్టికి, ప్రతి అంచెలోనూ రోగుల తాకిడికి తగ్గట్లు మౌలిక సదుపాయాల పరికల్పనకు- ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వెయ్యాలి! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.