1. గేటెడ్‌లో చికిత్స
కరోనా కేసులు పెరుగుతుండటంతో గేటెడ్ కమ్యూనిటీల్లో ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అనుమానిత లక్షణాలు, లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన, స్వల్ప లక్షణాలున్న, ముందస్తు లక్షణాలు కలిగిన వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. కరోనా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. వీటిని నివాస సంక్షేమ సంఘాలు సొంతగా లేదా ఎన్జీవోల సహకారంతో ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పలు సూచనలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తగ్గిన డిమాండ్
దేశంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ముంబయి, అహ్మదాబాద్, దిల్లీలో ఇళ్లకు గిరాకీ పడిపోయినట్లు, అత్యధికంగా హైదరాబాద్‌లో డిమాండ్ తగ్గినట్లు వివరించింది ప్రముఖ స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ 'ప్రాప్ టైగర్'. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కరోనాతో ఆదాయం
కారణమేదైనా ఆర్టీసీని నష్టాలు మాత్రం వీడటం లేదు. కరోనా కారణంగా బస్సు ఆక్యుపెన్సీ పడిపోయి.. నష్టాలు రెట్టింపయ్యాయి. ప్రతి నెలా కోట్లలో నష్టం వస్తోంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని బస్సులు నడుపుతున్నా.. ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఖాళీగా ఉన్న సీట్లను పార్శిల్స్ ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ. నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ నష్టాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నేడే సమావేశం
కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యల్లో భాగంగా నేడు బ్యాంకులు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) అధినేతలతో సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భారీ కుట్ర!
అయోధ్యలో రామ మందిరానికి ఆగస్టు 5న భూమిపూజ చేయనున్నారు. అదే రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా ఉగ్రదాడులకు పాక్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.