తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌ 10 న్యూస్‌ @ 9AM - topten news @9am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9am
టాప్‌టెన్‌ న్యూస్‌@9am

By

Published : Jul 11, 2020, 9:00 AM IST

1. కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,278 కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 32,224కు చేరింది. తాజా ఫలితాల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో అధికంగా 762 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 10,354 కరోనా పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

2. సొరియాసిస్‌ ఔషదం

కరోనా వైరస్​ నుంచి బాధితులను రక్షించేందుకు వైద్యులు చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగానే సొరియాసిస్​ వ్యాధి నివారణకు ఉపయోగించే ఇటోలిజుమాబ్​ ఇంజెక్షన్​ను బాధితులకు పరిమితంగా వాడేందుకు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అనుమతించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

3. ఇంటికే కరోనా కిట్

రోజురోజుకు కరోనా కేసులు పెరగగా ఇంట్లోనే ఐసోలేషన్​ ఉంటున్న వారి సంఖ్య పెరగుతోంది. వారందరికీ ఇళ్ల వద్దకే కరోనా కిట్​ను సరఫరా చేసేందుకు సర్కారు సన్నద్ధమైంది. రోగులకు అవసరమైన ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా అందించనుంది. శుక్రవారం అధికారులతో మంత్రి ఈటల నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

4. వాటితో కరోనా పోదు

వేడి నీళ్లు, కషాయంతో కరోనా వైరస్​ ఏ మాత్రం పోదని స్పష్టం ప్రముఖ డాక్టర్ ఎంవీ రావు. జ్వరం 101 డిగ్రీలు ఉన్నపుడు, దగ్గు ఆగకుండా వస్తున్నపుడే ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

5. అగ్గువకే కరోనా పరీక్షలు

తక్కువ ఖర్చుతో కొవిడ్‌ పరీక్షలు చేసే రెండు పద్ధతులను సీసీఎంబీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. నెలరోజుల క్రితం వీటిని ఐసీఎంఆర్‌ ధ్రువీకరణకు పంపారు. వారి నుంచి అనుమతి వస్తే కరోనా పరీక్షల విధానంలో సమూలంగా మార్పులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

6. ఏపీదే తప్పు

గోదావరి- పెన్నా అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించే పథకం విషయంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్‌ తప్పు దారి పట్టించిందని తెలంగాణ ఆరోపించింది. పోలవరం, పట్టిసీమల ద్వారా మళ్లించే నీటిలో తెలంగాణ వాటా అంశంలో జాప్యం చేయడానికి నిర్ణయించుకొన్న ఆంధ్రప్రదేశ్‌ ఉద్దేశపూర్వకంగానే చర్చ జరగకుండా బోర్డును తప్పుదోవ పట్టిస్తోందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

7. ఈటీవీ భారత్ ఎఫెక్ట్

ఇళ్లలో ఐసోలేషన్ ఉంటూ అవస్థలు పడుతున్నారంటూ జులై 8న ఈటీవీ భారత్​లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు 'హోం ఐసోలేషన్.. ఇరుకు ఇళ్లలో బాధితుల పరేషాన్!' శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాధితుల కోసం శుక్రవారం టోల్ ఫ్రీ కొవిడ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు అందజేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

8. పీఏసీ నిర్ణయం

తూర్పు లద్దాఖ్​లో భారత్​, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, ఎత్తైన ప్రాంతాల్లో సాయుధ దళాలకు అవసరమైన దుస్తుల కొనుగోలుపై సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

9. భూమికి దగ్గరగా తొకచుక్క

కొత్తగా కనిపెట్టిన తోకచుక్క ‘నియోవైజ్‌’ భూమికి చేరువగా రానుంది. వారం కిత్రం బుధ గ్రహం కక్ష్యను దాటిన ఆ తోక చుక్క మరో రెండో వారాల్లో భూమిపై నుంచి కనబడనుంది. ఇది దాదాపు 5కి.మీ. పొడవు ఉండనుందని, రాత్రి వేళల్లో కళ్లకు కనిపిస్తుందని నాసా వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

10. బిగ్‌ బీ మనవడు

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ ఇంట్లో అందరూ సినిమా పరిశ్రమకు సంబంధం ఉన్నవాళ్లే. తాజాగా, ఆయన మనవడు అగస్త్య నందా హీరోగా పరిచయమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details