స్పెషల్ ఆపరేషన్
వాస్తవాధీన రేఖ వెంట హద్దు మీరుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సైనికపరంగా ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది భారత్. పాంగాంగ్ సరస్సు వద్ద డ్రాగన్ బలగాలను వెనక్కి పంపేయడానికి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టే అంశంపై భారత్ యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
చైనాతో సుదీర్ఘ చర్చలు..
గల్వాన్ లోయలో ఘర్షణ తలెత్తి 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండోసారి సమావేశమయ్యారు ఇరు దేశాల సైనికాధికారులు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వేగంగా రహదారి నిర్మాణం
చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మాణంలో ఉన్న 32 రహదారి పనులను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. సోమవారం ఈ పనులపై కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో మూడు నెలలు ఇవ్వండి
కరోనా కాలంలో పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆహారధాన్యాల పంపిణీని మరో మూడు నెలలు పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆర్థింగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా విజృంభణ
లాక్డౌన్ సడలింపులతో తెలంగాణలో కొవిడ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. తొలి కేసు మార్చి 2న నమోదు కాగా.. అప్పట్నుంచి మే 17 వరకు 34 మంది చనిపోయారు. జూన్ 21 వరకూ ఈ సంఖ్య దాదాపు ఐదింతలు పెరిగి 176 మంది మరణించారు. కరోనాను కట్టడి చేయడం ద్వారానే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పాస్ చేయాలా? వద్దా?
ఇంటర్లో తప్పిన విద్యార్థులకు ఈ సారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించరాదని ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ వారందరినీ కండోనేషన్ లేదా కంపార్ట్మెంటల్ పాస్ చేయాలా? అని తర్జనభర్జన పడుతోంది. ఈ విషయమై అన్ని రాష్ట్ర బోర్డులు సభ్యులుగా ఉండే కాబ్సే అధికారులతోనూ మాట్లాడుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారీ వర్షాలే..!
ఒడిశా ఉత్తర ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు, నాలుగు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హెచ్-1బీ వీసాలపై కీలక నిర్ణయం
వేలాది మంది భారతీయుల కలల్ని నీరుగార్చే నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హెచ్-1బీ వీసాలు సహా ఇతర తాత్కాలిక ఉపాధి వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేయనున్నారని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పైపైకి ఇంధన ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలు, వ్యాట్‌లు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. లాక్డౌన్తో ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అంతకంతకూ ధరలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఓటీటీలోనే విడుదల..
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ పుకార్లేనని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.