1. కన్నీటి నివాళి..
చెన్నైలో ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఎడతెరపి లేని వర్షాలు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 18.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. జోగులాంబలో పెద్దగంట
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో 613 కిలోల భారీ గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామేశ్వరం నుంచి అయోధ్యకు తీసుకెళుతున్న ఈ గంటను.. తమిళనాడుకు చెందిన ఓ మహిళ తయారు చేయించింది. మోదీ జన్మదినం సందర్భంగా రామ రథయాత్ర పేరుతో ఈ గంటను రామేశ్వరం తీసుకెళ్తున్నట్లు ఆమె వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నేడు మోదీ ప్రసంగం
ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక ప్రసంగం చేయనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అంశాలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయనున్నారు. కరోనా, ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై మోదీ మాట్లాడే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అడుగు పడని అనుసంధానం
నదీజలాల సద్వినియోగం ద్వారా దురవస్థలకు అడ్డుకట్ట వేసి సుస్థిర మానవాభివృద్ధిని సాధించేందుకు నదుల అనుసంధానమే అత్యుత్తమ పరిష్కారం. ఎన్నో అధ్యయనాలు, మరెన్నో నివేదికలు దశాబ్దాలుగా ఘోషిస్తున్నదీ ఇదే. ఈ వాస్తవాన్ని అవగతం చేసుకున్న మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఈ బృహత్పథకం సాకారం కావడం తన ప్రగాఢవాంఛ అని ప్రకటించారు. పదిహేనేళ్లు గడచిపోయినా ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.