1. కలిసి పోరాడాలి..
ప్రపంచంలో ఎక్కడా లేని మనిషిని మనిషి చిన్నచూపు చూసే దౌర్భాగ్య పరిస్థితి మన దగ్గరే ఉందని మంత్రి ఈటల రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీ టైమ్స్, మహాత్మ జ్యోతిబా ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నాదే బాధ్యత
అగ్రకులాల పేదల రిజర్వేషన్ల జీవో విడుదల చేయించే బాధ్యత తనదేనని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలన్నదే సీఎం కేసీఆర్ సిద్ధాంతమని గుర్తుచేశారు. హన్మకొండలో జరిగిన రాష్ట్ర ఓసీల మహా గర్జన సభకు ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాళ్ల దాడి..
వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఇంట్లోని పూలకుండీలు, అద్దాలు ధ్వంసం చేశారు. రామమందిరం నిధుల సేకరణపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణుల ఆందోళన చేపట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తండ్రి పోరాటం..
కుటుంబంలో ఏ చిన్నకష్టం వచ్చినా తండ్రి అల్లాడుపోతాడు. ఆ బాధ తీర్చేందుకు సర్వశక్తులొడ్డుతాడు. కానీ ఇంట్లోవారందరూ కళ్లెదుటే భరించలేని వేదన అనుభవిస్తుంటే... ఆ తండ్రి అనుభవించే శోకం అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే అంధురాలైన కుమార్తె... ప్రమాదంలో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న కుమారుడు. పక్షవాతంతో మంచాన పడ్డ భార్య. ఇలా... ఉప్పెనలా వచ్చి పడ్డ కష్టాల కడలికి ఎదురీదుతున్నాడు... ఓ వృద్ధుడు. విధిని ఎదిరించలేక... కమ్ముకున్న కష్టాల నుంచి తప్పించుకోలేక దీనస్థితిలో గడుపుడున్న ఓ వృద్ధ తండ్రి విషాద గాథపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ముందే తెలుసా..!
దిల్లీ బాంబు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ విషయంలో పలువురు క్యాబ్ డ్రైవర్లను విచారించారు. మరోవైపు తమ విజ్ఞప్తికి అనుహ్య స్పందన వస్తుందని దిల్లీ పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకునేందుకు రాజధాని ప్రజలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.