1. దేశంలోనే అగ్రగామిగా..
కనీవినీ ఎరుగని వినూత్న పథకాలు , సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్... రాష్ట్ర పురోగతిపై ప్రసంగించారు. 2020 ఏడాదంతా కరోనా కల్లోలంలో కష్టంగా గడిచిందన్న గవర్నర్... కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభంతో 2021ని ఆశావహ దృక్పథంతో ప్రారంభించుకున్నట్లు చెప్పారు. ఆరున్నరేళ్లుగా ప్రభుత్వం పద్ధతి ప్రకారం చేస్తున్న కృషి వల్ల తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెలంగాణ 'కనకం'
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనకరాజును... పలువురు మంత్రులు అభినందించారు. గుస్సాడి నృత్యానికి గుర్తింపు తేవడమే కాకుండా... రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారని కొనియాడారు. ఇది ఆదివాసీలకు జాతీయస్థాయిలో దక్కిన గౌరవం అని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నాకే పరీక్షలా..?
మూఢ భక్తితో ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు రోజుల క్రితం ఇద్దరు కుమార్తెలను కన్నవారే కడతేర్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు పురుషోత్తం, పద్మజపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ-1గా పురుషోత్తం, ఏ-2 గా పద్మజను చేర్చారు. నిందితులకు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో పద్మజ తన వింత ప్రవర్తనతో అందరినీ హడలెత్తించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. షా సమీక్ష..
దిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత, పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలపై చర్చే ప్రధానాంశంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగినట్టు సమాచారం. దిల్లీలో తాజా పరిస్థితులను షాకు అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో టెలికాం సేవలను నిలిపివేశారు అధికారులు. మెట్రో సేవలకూ అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అదో మాయని మచ్చ..
దిల్లీలోని ఎర్రకోటలోకి రైతులు ప్రవేశించడాన్ని కేంద్ర పర్యటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ తప్పుపట్టారు. అన్నదాతల చర్య భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన ఎర్రకోటను అగౌర పరిచేలా ఉందని ఆరోపించారు. మరోవైపు హింస వల్ల సమస్యలు పరిష్కారం కావని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.