1. దోచేశారు..
తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ బంగారం చోరీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, యూపీకి చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తిరగనియ్యం..
నిజామాబాద్లో పసుపు రైతులతో ముఖాముఖి సమావేశమైన ఎంపీ అర్వింద్... అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే... ఎంపీని అడుగడుగునా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నువు లేకుండా.. నేనుండలేను..
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఉపాధి కోసం అబ్బాయి దూర దేశాలకు వెళ్లాడు. అమ్మాయి ఊర్లోనే ఉంది. తమ భవిష్యతు గురించి ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఇద్దరి మధ్య దూరమెంతున్న వారి మనుసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాయి. అంతా బానే ఉందనుకునే సమయంలో... ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తనను విడిచి వెళ్లిన ప్రియురాలిని తలుచుకుంటూ... ఆ ప్రేమికుడూ... తనువు చాలించాడు. అసలు ఏం జరిగింది.. ఎందుకు వాళ్లు ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. డాక్టరమ్మ..
ధన్వంతరి వారసులం.. ధరణిలో దేవతలమన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ సుధాచైతన్య. ఆ వైద్యురాలంటేనే గర్భిణీలకు నమ్మకం.. ప్రసవం అంటేనే పునర్జన్మగా భావించేవారు ఆమె ఉంటే ఎలాంటి గండాన్ని అయినా గట్టెక్కిస్తారన్న విశ్వాసంతో ఉంటారు. గతేడాది జగిత్యాల జిల్లాలో సర్కారీ వైద్యశాలల్లో నమోదైన ప్రసవాల్లో సగానికి సగం ఆమె చేతి మీదుగానే జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మోదీకి అభినందనలు
కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రపంచ దేశాలకు తోడ్పాటును అందిస్తున్నందకు ప్రధాని మోదీని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ అభినందించారు. వైరస్ నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.