1. ఇదో మైలురాయి
పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ చేసిన ప్రధాని.. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటు భవనం.. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి సాక్షిగా నిలుస్తుందని అన్నారు మోదీ. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశ విభిన్నతను చాటేలా నిర్మించే ఈ భవన నిర్మాణం 2022కల్లా పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నడ్డాపై దాడి
బంగాల్లో జేపీ నడ్డా వాహనశ్రేణిపై దాడి విషయంలో భాజపా, టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. దాడి అప్రజాస్వామికమని భాజపా ఆరోపించింది. రాష్ట్రంలో గూండాల పాలన పెచ్చరిల్లిపోతోందని ధ్వజమెత్తింది. అయితే వీటిని ఖండించి టీఎంసీ.. ప్రణాళిక ప్రకారం భాజపా కార్యకర్తలు వారిపై వారే దాడి చేసుకున్నారని చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కేసీఆర్ లేకుంటే..
సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట పేరులోనే ఓ బలం ఉందన్నారు. సిద్దిపేటతో తనకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. సిద్దిపేటను జిల్లా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను కోరినట్టు చెప్పుకొచ్చారు.
4. హైకోర్టు అనుమతి
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఉన్నత న్యాయస్థానం అనుమతి తెలిపింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అంగీకారం తెలిపింది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుకింగ్ విధానాన్ని కోర్టు అనుమతించింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనను కూడా అంగీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. చర్చిద్దాం రండి..
వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. చలికాలంలో, కరోనా పరిస్థితుల్లో నిరసనలు చేస్తున్న రైతుల గురించి ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే నిరసనలు విరమించి.. కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.