1. మేం వ్యతిరేకం..
ఈనెల 8న రైతులు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు తెరాస మద్దతిస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రైతు శ్రేయస్సు కోసం అన్ని వర్గాల వారు సంఘీభావం తెలపాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. స్ఫూర్తిని కాపాడుకోవాలి
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి భట్టి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గృహిణి ఆత్మహత్య
కళ్ల ముందే తల్లి ఉరివేసుకుంది. పిల్లలు... తమ తల్లి కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. కళ్ల ముందే తల్లి చనిపోతున్నా... కాపాడుకోలేకపోయిన ఆ పిల్లల బాధ వర్ణాణాతీతం. వారి రోదనలు ఆపతరం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటన హైదరాబాద్ లాలాగూడ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వెనక ఎవరున్నారు?
అర్జునమూర్తి, తమిళరువి మణియన్‌కు తాను పెట్టబోయే పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు సూపర్‌స్టార్ రజనీకాంత్. దీంతో వీరి పేర్లు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అర్జునమూర్తి, మణియన్ ఎవరు? వారి ప్రస్థానం ఏంటి? రజనీతో వారికున్న సంబంధమేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పుణెలో ప్రయోగం
పుణెలోని నోబుల్ ఆస్పత్రిలో స్పుత్నిక్ వీ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో 17 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించినట్లు వైద్యులు తెలిపారు. నిబంధనల ప్రకారమే వలంటీర్లను ఎంపిక చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.