1. సర్వం సిద్ధం
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 150 డివిజన్లలో... 1,122 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా... 74 లక్షల మందికిపైగా ఓటర్లు... ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. కరోనా వ్యాప్తి వేళ... బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఇవి ఉంటే చాలు
సామాన్యుడు ఆటంకం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల అధారిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేని సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్యాయంగా 18 గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నేత ఇంట్లో మద్యం
తెరాస అభ్యర్థి మద్యం పంపిణీ చేస్తున్నారంటూ... భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. చైతన్యపురి డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఇంట్లో మద్యం సీసాలు ఉన్నట్లు.. ఎన్నికల అధికారికి భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తనిఖీలు చేపట్టగా... శ్రీనివాస్ ఇంట్లో, కారులో మద్యం సీసాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆగస్టు నాటికి..
వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోపు దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆగస్టులోపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించింది. ఈ మేరకు 'హ్యాష్ ట్యాగ్ స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్' పేరిట ఓ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.