1. నిద్రపోను..
కొవిడ్ సమయంలో ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల పాటు కోత విధించిన 50 శాతం జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్లో బస్సుసర్వీసులను 50 శాతానికి పెంచాలన్న సీఎం... ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు. ఆర్టీసీని బతికించుకొని తిరిగి గాడిన పెట్టే వరకు నిద్రపోనన్న కేసీఆర్... తాను ఉన్నంత కాలం సంస్థను బతికించుకుంటానని ఉద్ఘాటించారు. కార్గో సేవలను ప్రజలు బాగా ఆదరించటం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పర్యవేక్షక కమిటీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలపై భాజపా ప్రత్యేక దృష్టిసారించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జాతీయ నాయకులతో కమిటీ వేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. బల్దియా పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రత్యేక విభాగం
జీహెచ్ఎంసీలో వరదలు పాలకుల కళ్లు తెరిపించాయి. దీంతో హైదరాబాద్ చెరువులకు మహర్దశ వచ్చింది. నగరానికి బాహ్యవలయ రహదారి లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ ఏడాది భారీ వర్షాలకు పెద్దఎత్తున కాలనీలు ముంపు గురి కావడంతో చెరువుల సంరక్షణ, నిర్వహణపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మందు పంపిణీ..
హీరోలు, నాయకుల పుట్టిన రోజులకు అభిమానులు... అన్నదానాలు, రక్తదానాలు, ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంచడం చాలా సాధారణమైన విషయం. తన అభిమాన వ్యక్తి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడో... వార్తల్లో నిలవాలనుకున్నాడో... ఈ వీరాభిమాని మాత్రం తనకు ఇష్టమైన వ్యక్తి పెళ్లిరోజున... అన్నింటికీ భిన్నంగా... మరీ వినూత్నంగా... మద్యం పంచాడు. ఫ్రీగా కాందండోయ్... రూపాయికి ఓ క్వార్టర్ చొప్పున పంచాడు. అసలు ఆ వీరాభిమాని ఎవరో మీరే చూడండి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ముగ్గురు మృతి
నిజామాబాద్ జిల్లా అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.