1. మూడు రోజులు వర్షాల్లేవ్..!
రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు అక్టోబరు 28న ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మాకే లాభం..
తెరాసపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. రెండు పడకల ఇళ్లను ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే భాజపాకు అంత లాభం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల అంశమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రదానంకానుందని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మొదటి దశ ముగింపు..
బిహార్లో తొలిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం పర్వం ముగిసింది. మొదటి ఫేజ్లో భాగంగా అక్టోబర్ 28న 71 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తగ్గిన మరణాల రేటు
దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్ఖ ప్రమాణాల ప్రకారం.. భారత్లో అత్యల్పంగా 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. శునకం షాట్లు..
తన యజమానిని గెలిపించేందుకు ఓ శునకం వాలీబాల్ ఆడుతోంది. వాలీబాల్ కోర్టులో చకచక తిరుగుతూ ఆటగాళ్లకు దీటుగా షాట్లు కొడుతోంది. సాగు కాలువలో యజమాని మిత్రులతో పాటు ఆడుతూ.. వారికే సవాల్ విసురుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.