1. షోకాజ్ నోటీసులు..
పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, ఫీజులపై హైకోర్టులో విద్యాశాఖ కౌంటరు దాఖలు చేయగా... ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో 46ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. జీవో ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదులపై 55 పాఠశాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి విన్నవించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నేనూ అక్కడే చదివా..
హైదరాబాద్‌లో నిర్వహించిన బిషప్‌లు, క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. పేద దేశాల్లో క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవలు మరవలేనివని మంత్రి కేటీఆర్ ప్రశసించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం కూడా మిషనరీ స్కూల్లోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3 .ఆ రాష్ట్రాల్లోనే అధికం..
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు, రికవరీల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 78.86 శాతానికి చేరిందని తెలిపింది. అదే సమయంలో మరణాల రేటు 1.63 శాతానికి తగ్గినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బీఎస్-4కు ఓకే..
అత్యవసర సేవలు సహా దిల్లీ పోలీసులు వినియోగించేందుకు ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఫాడా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహనాలనే విక్రయించాలని గతంలోనే స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మళ్లీ నిరాశే..
హెచ్ -1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాలు చేస్తూ.. భారతీయులు వేసిన పిటిషన్ను అమెరికా కోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.