1. పాతికేళ్ల అనుబంధం..
దక్షిణ భారత టెలివిజన్ రంగంలో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టిన... మీటీవీ ఈటీవీ.. ఇరవై ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తెలుగు టెలివిజన్ రంగంలో రెండున్నర దశాబ్దాల పాటు ప్రేక్షక నీరాజనాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈటీవీ రజతోత్సవం జరుపుకుంది. ఆబాల గోపాలన్ని అలరించే కార్యక్రమాలు, విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తలకు చిరునామాగా నిలిచి.. 25వ పుట్టినరోజును జరుపుకున్న ఈటీవీ.. మరెన్నో ఆనందాలు, సంతోషాలకు స్వాగతం పలుకుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మీరే ఆదుకోవాలి..
రాష్ట్రంలో చేపడుతున్న పారిశ్రామిక పార్కులకు కేంద్ర సాయం కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో నిర్వహించిన 'వన్ డిస్ట్రిక్ - వన్ ప్రొడక్ట్' కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాగల మూడ్రోజులు
నైరుతి ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నందున తెలంగాణలో శుక్రవారం.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దేశీయంగానే తయారీ..
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. గతంలో ఉన్న అవకాశాలు వినియోగించుకోవటంలో భారత్ విఫలమైందన్నారు. దేశంలో రక్షణ పరికరాల తయారీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన ఆయన.. ఈ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సమావేశాల సన్నాహాలు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమీక్ష నిర్వహించారు. భౌతిక దూరం పాటించేందుకు అనుసరించిన వ్యూహాలపై అధికారులతో చర్చించారు. పార్లమెంట్ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.