1. 'ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్ అసాధ్యం'
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్... ఆగస్టు 15 లోపు కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఓ వ్యాక్సిన్ బయటకు వచ్చే ముందు అనేకమార్లు ప్రయోగాలు చేయాలని, దాని భద్రతపై మదింపు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అందువల్ల ఇంత తక్కువ సమయంలో ఓ వ్యాక్సిన్ రూపొందించడం కుదరదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దిల్లీలో కరోనా తగ్గుముఖం- పాజిటివిటీ రేటు 10%!
దిల్లీలో కరోనా మహమ్మారి పరీక్షల సామర్థ్యం పెంపుతో పాజిటివిటీ రేటు 30 శాతం నుంచి 10 శాతానికి పడిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్రం, రాష్ట్రప్రభుత్వం సమన్వయంతో తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ఇది సాధ్యమైనట్లు వెల్లడించిది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 59.16లక్షల మందికి రైతుబంధు ఇచ్చాం
రాష్ట్రవ్యాప్తంగా 59.16 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 26వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో... మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికంగా రుణాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేస్తాం
హైదరాబాద్లో ఫార్మాసిటీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దుచేస్తామని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'పత్రికలకు, జర్నలిస్టులకు భాజపా అండగా ఉంటుంది'
రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వైరస్ వ్యాప్తి గురించి వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.